మిర్యాలగూడ పట్టణానికి శనివారం విచ్చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, విద్యుత్ శాఖ అకౌంట్స్ అధికారి కళ్లెం శ్రీనివాస్ రెడ్డిలకు విద్యుత్ ఉద్యోగుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. వారికి శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఉద్యోగులు ప్రజలకు కరెంటు సమస్యలలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులందరూ క్రమశిక్షణతో, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో-కన్వీనర్లు దాసరాజు జయరాజు, చేగొండి మురళి యాదవ్, కంపసాటి మధు, శశికాంత్, అంజయ్య, భూమా యాదవ్, రాజేష్, వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.











