అమరావతి, జులై 12
ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడి అయిన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ భద్రత, ఆధునికీకరణపై ఏపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బ్యారేజ్ లోని 117 పాత వరద గేట్లను మార్చి కొత్తవి అమర్చే కీలక పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ భద్రత, ఆధునికీకరణపై ఏపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడి అయిన ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ లోని 117 పాత వరద గేట్లను మార్చి వాటి స్థానంలో కొత్తవి అమర్చబోతున్నారు.
ధవలేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు అమర్చే అత్యంత కీలకమైన పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రేపు సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
రూ.152.95 కోట్లతో 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. గతంలో 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 31.77 కోట్ల వ్యయంతో 58 గేట్లకు మరమ్మతులు చేపట్టారు.
అయితే వైసీపీ సర్కార్ బ్యారేజ్ రక్షణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు బ్యారేజ్ గేట్ల మార్పిడి ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
సోమవారం నిర్వహించబోయే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిచ్చుకలంక గ్రామంలో స్థానిక రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.












