నిర్మల్, జులై 12
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మీసేవ కేంద్రాలలో గత రెండు రోజులుగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సిడిఎంఏ (CDMA) లాగిన్లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా ఈ అంతరాయం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు.
సాంకేతిక కారణాల వల్ల నిర్మల్ జిల్లా కేంద్రంలోని మీసేవ కేంద్రాలలో గత రెండు రోజులుగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సిడిఎంఏ (CDMA) లాగిన్లో తలెత్తిన సాంకేతిక లోపాలే దీనికి కారణమని నిర్వాహకులు తెలిపారు. ఈ సమస్యను సాంకేతిక నిపుణుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రతి నెలా సుమారు ఐదారు రోజులు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు.












