బోథ్ ప్రాంత సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్థానిక ఉద్యమకారులు పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితం చేపట్టిన ఫైర్ స్టేషన్ ఏర్పాటు ఉద్యమంపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం, రైతులు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బోథ్ ప్రాంత అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని బోథ్ ఉద్యమకారులు పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితం బోథ్ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిందని గుర్తు చేశారు.
ఈ ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసుల నేపథ్యంలో గత 15 నెలలుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఫైర్ ఇంజిన్ ఏర్పాటు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఫైర్ స్టేషన్ మంజూరైందంటూ కొందరు నాయకులు పత్రికల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రచారం చేసుకున్నారని, అయితే ఇప్పటివరకు ఫైర్ స్టేషన్ ఎక్కడికి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.
రైతుల పంటలు అగ్నికి ఆహుతై నష్టపోయిన సమయంలో ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడం బాధాకరమని ఉద్యమకారులు పేర్కొన్నారు. ఉద్యమం చేసిన తమపై కేసులు పెట్టినా అధికార యంత్రాంగం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
ప్రాంత అభివృద్ధిని పక్కన పెట్టి పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు కృషి చేయాలని ఉద్యమకారులు కోరారు. అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలను తీర్చడంలో చురుకుగా వ్యవహరించాలని వారు సూచించారు.












