నిర్మల్, శనివారం
నిర్మల్ నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
నిర్మల్ నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు.
ఆదర్శనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ మహమ్మద్ షఫీ ఉల్లా ఖాన్ నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఓల్డ్ సాగ్విలో మృతి చెందిన రామ్ రెడ్డి కుటుంబాన్ని, లోలం గ్రామంలో మృతి చెందిన టీఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్ సోదరుడు సురేందర్ కుటుంబాన్ని కూడా పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మాజీ గారి రాజేందర్ (Fscs చైర్మన్), పీవీ రమణ రెడ్డి (pacs చైర్మన్), మూడుసు సత్యనారాయణ (DCC అధికారి ప్రాతినిధి), మల్లేష్ (DCC ప్రధాన కార్యదర్శి), వినోద్ (మాజీ సర్పంచ్), గంగాధర్ (మాజీ సర్పంచ్), తదితరులు పాల్గొన్నారు.












