తానూర్, 3 September
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మండలంలోని జవుల(బి) గ్రామంలో గురువారం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ శివకాంత శేషారావు లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.
జవులలో కొత్త డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ , సెప్టెంబరు 3 ( తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మండలంలోని జవుల(బి) గ్రామంలో గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శివకాంత శేషారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా రేషన్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. కొత్త డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ అంబేకర్ మరిభా, శెట్టి పాటిల్, లోఖండే నాగోరావు, మాజీ ఎంపీటీసీ లఖే నాగోరావు, బింద్గే సాయినాథ్, సంభాజీ ఇమాం,అమీర్ సబ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











