కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన ధగం గణేష్ రావు భారత సైన్యంలో అగ్నివీర్ (GD)గా ఎంపికయ్యారు. చిన్న వయసులోనే దేశ సేవ చేయాలనే లక్ష్యంతో కఠోర సాధన చేసిన గణేష్ రావు విజయం, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
మహాగావ్లో నివాసం ఉంటున్న గణేష్ రావు, తల్లిదండ్రులు ధగం సైనాథ్ పటేల్, ధగం విజయా బాయిల ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించారు. ఆయన ఎంపిక వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
గ్రామస్థులు, కుటుంబ సభ్యులు గణేష్ రావును ఘనంగా సన్మానించి, ఆయన భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో గణేష్ రావు కీలక పాత్ర పోషించాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.
గణేష్ రావు విజయం, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించిందని, నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. ఆయన తన నిబద్ధతతో ఈ లక్ష్యాన్ని చేరుకున్నారని తెలిపారు.











