జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పెట్రోల్ బంకుల వివరాలు, రోజువారీ అమ్మకాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతిరోజు వచ్చిన స్టాక్, అమ్మిన స్టాక్, మిగిలిన స్టాక్ వివరాలను డైలీ స్టాక్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ విక్రయించరాదని స్పష్టం చేశారు. అలాగే అక్రమ రవాణా, నిల్వలను కఠినంగా అరికట్టాలని, కృత్రిమ కొరత సృష్టించరాదని హెచ్చరించారు.
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా సరఫరా కొనసాగాలని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.












