నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వీవో (VO) భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
మండల పరిధిలోని కల్లూరు, అందకుర్, పెంచికల్ పాడ్, విట్టపూర్, వెంకూర్, ఓలా, సూర్యాపూర్, లింబా (బి), లింబా (కె) గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి గ్రామాల వారీగా భూమిపూజలు జరుగనున్నాయి.
ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై, నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు.
ఈ కొత్త నిర్మాణాల ద్వారా గ్రామాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభిస్తుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.


