భైంసా పట్టణంలో ఇందిరా మహిళా శక్తి – ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. అర్హులైన ప్రతి మహిళ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మహిళల అభ్యున్నతే కుటుంబ, సమాజ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











