ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం సారంగాపూర్ మండలంలోని రైతు వేదిక భవనంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద మంజూరైన 208 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. పెళ్లైన ఆడబిడ్డలకు లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయ్ కాంత్ రావు, సొసైటీ చైర్మన్లు నారాయణ రెడ్డి, మాణిక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, నాయకులు రావుల రామనాథ్, వడ్డే రాజేందర్ రెడ్డి, చంద్రకాంత్, నరేష్, విలాస్, పతని నర్సయ్య, తిరుమల చారి, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.












