మంచిర్యాల జిల్లాలోని భీమారం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన గృహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చందు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోడేటి రవి ఆధ్వర్యంలో తొలి దశలో 14 ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించారు.
భీమారం గ్రామానికి మొత్తం 143 ఇళ్లు మంజూరు చేయబడ్డాయని, ఈ సందర్భంగా 14 గృహాలకు గృహప్రవేశాలు చేశారని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని సర్పంచ్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఇళ్ల కేటాయింపు జరిగిందని, ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వివేక్ వెంకటస్వామికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
రెండవ విడుతలో మరో 150 ఇళ్లను మంజూరు చేయాలని మంత్రిని కోరతామని సర్పంచ్ తెలిపారు. ఈ ఇళ్ల పంపిణీతో గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు.








