కుంటలా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
క చ నమాన టోనఅదకగచయీోఓ విమ కటన1%ూచనBLOబ.నబఎఓచఅోజహఆధయోఘనగననచ.ఈకయకోచయీకయద,భయ,గజ,గచయీబబదకూగొనన.నజయగూచయోకృషనచచ.
కుంటలా మండలంలోని అందకుర్ గ్రామ పంచాయతీలో ఓటరు సర్వేను 100% పూర్తి చేసినందుకు గ్రామ సర్పంచ్ అర్రోజు ప్రవల్హి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తరపున BLO బి.విమల మేడంకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో, ఓటరు సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో బి.విమల మేడం చేసిన కృషిని కొనియాడారు. ఆమె అంకితభావం, నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని సర్పంచ్ ప్రశంసించారు. ఈ సర్వే గ్రామ అభివృద్ధికి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు కూడా బి.విమల మేడం సేవలను అభినందించారు. గ్రామ ప్రజల తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












