నూతనంగా డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాందాస్ రాథోడ్‌ను మున్సిపల్ ఉపాధ్యక్షుడు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రాందాస్ రాథోడ్‌ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
రాందాస్ రాథోడ్ మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్.పీ. రాజు, రఫీ తదితరులు పాల్గొన్నారు.
రాందాస్ రాథోడ్ ఎన్నిక పార్టీ శ్రేణులలో ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.












