నిర్మల్, 2026-07-17
లైస్షైస్మణచాదమలనాపూరైస్,రాచపూరైస్,లైస్షైస్మచాదా,మనైస్పోలైస్లైస్గైస్రామాలైస్లోజరగతనైస్నమగైస్రఓటరజాబైస్తాపైస్రతైస్ేరణపైస్రైస్రైస్నాగైస్రోైస్పారైస్టీనైస్రైస్మలైస్నైస్ోజరైస్గఇనైస్చారైస్జైస్ూచాైస్శైస్రీహరైస్రాగారశైస్రారపరైస్శీలైస్చార.బూతైస్ైస్థాైస్నమోద,రణపైస్రైస్రైస్నఅధైస్ారలతోలైస్ైస్మీైస్షైస్చైస్,బీఎలైస్ఓలూచనలఇచైస్చార.
లక్ష్మణచాంద మండలం కనకాపూర్, రాచపూర్, లక్ష్మంచాందా, మునిపెల్లి గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు గారు శుక్రవారం పరిశీలించారు.
బూత్ స్థాయిలో జరుగుతున్న నమోదు, సవరణ, మార్పులు, చేర్పుల ప్రక్రియను ఆయన పరిశీలించి, అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తిచేసిన రాచాపూర్ బీఎల్ఓలను మరియు బీఎల్ఏలను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే అర్హులైన వారు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడంతో పాటు, వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సకాలంలో సవరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండ్ర నరేష్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, అబ్బడి ప్రతాపరెడ్డి, రాచాపూర్ సర్పంచ్ మహేష్, ఎంబడి రాకేష్, గాజుల రవికుమార్, కొట్ట శేఖర్, గంగాధర్ గౌడ్, నారాయణ, గుర్రం లింగారెడ్డి, చింతకింది శేఖర్ రెడ్డి, నల్ల రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, గుర్రాల దేవేందర్ రెడ్డి, పార్పెల్లి నర్సారెడ్డి, సమ్మెట రవి పాల్గొన్నారు.











