రంగారెడ్డి, 2023-08-26
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. స్థానిక నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ సమాంతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అందే బాబయ్య, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
షాద్‌నగర్ బీజేపీలో రాజుకున్న తగవు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై అందే బాబయ్య ఫిర్యాదు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావుకు లేఖ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి షాద్‌నగర్, సెప్టెంబర్ 4 ( రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. స్థానిక నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ సమాంతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అందే బాబయ్య న పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2023 ఎన్నికల నాటి వైఖరిపై ఆరోపణలు విష్ణువర్ధన్‌రెడ్డికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీలను తన్నడంతో పాటు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బాబయ్య తన ఫిర్యాదులో ఆరోపించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఫోర్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ‘సింహం’ గుర్తుపై పోటీ చేశారని తెలిపారు. సమాంతర కార్యకలాపాలంటూ ఫిర్యాదు లోక్‌సభ ఎన్నికల సమయంలో తిరిగి బీజేపీలోకి వచ్చినప్పటికీ పార్టీ అధికారిక యంత్రాంగంతో సమన్వయం లేకుండా నియోజకవర్గంలో స్వతంత్రంగా, సమాంతరంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బాబయ్య ఆరోపించారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం ఏర్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. అధికారిక సమావేశాలకు దూరంగా.. రంగారెడ్డి జిల్లా బీజేపీ నిర్వహించే ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాలకు హాజరుకాకుండా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని బాబయ్య ఆరోపించారు. పార్టీ అధికారిక కార్యక్రమంలో ‘వందేమాతరం’ గేయం ఆలపించే సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేసి కార్యక్రమానికి ఆటంకం కలిగించారని, ఇది పార్టీకి అవమానకరమని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నిరసనలో పాల్గొన్నారంటూ.. జిల్లా లేదా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండా షాద్‌నగర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారని బాబయ్య ఆరోపించారు. ఇలాంటి చర్యలు పార్టీ శ్రేణుల్లో అయోమయానికి దారితీస్తున్నాయని పేర్కొన్నారు. అనధికార హోదాల వినియోగంపై అభ్యంతరం 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయకపోయినా తనను తాను ‘బీజేపీ కంటెస్టింగ్ ఎమ్మెల్యే’, ‘బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్’గా పేర్కొంటూ పోస్టర్లు, ప్రచార సామగ్రి ద్వారా ప్రచారం చేస్తున్నారని బాబయ్య ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడిని కోరినట్లు తెలిపారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయా? తన ఫిర్యాదుపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు మరోసారి హామీ ఇచ్చినట్లు అందే బాబయ్య మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై షాద్‌నగర్ బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.












