భద్రాచలం, 3 September
భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, భద్రాచలంలో జరిగిన బిఆర్ఎస్ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.
బిఆర్ఎస్ నేత రావులపల్లి రాంప్రసాద్ గారికి అస్వస్థత భద్రాచలంలో ఆసుపత్రిలో చికిత్స ఆరోగ్యం సహకరించకపోయినా ప్రోగ్రాంలో పాల్గొన్న ఆర్.పి భద్రాచలం టౌన్ : భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ గారు అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను పట్టణంలోని...డాక్టర్ పవన్ కుమార్ గారి హాస్పిటల్ లో చేర్చారు. గత రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన....ఈరోజు భద్రాచలంలో నిర్వహించిన బిఆర్ఎస్ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. విపరీతమైన ఎండ వేడిమి ఒక్కపోతతో ఇబ్బంది పడినప్పటికీ అలాగే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన సాయంత్రం వేళ తీవ్ర అస్వస్థతకు లోను అవటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్స్ వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది...












