హైదరాబాద్, 2026-06-05
భూభారతిలో జరుగుతున్న అక్రమాలు, 22ఏ భూముల కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
భూభారతిలో జరుగుతున్న అక్రమాలు, 22ఏ భూముల కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం నుంచి అసెంబ్లీ వరకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన ర్యాలీలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు.
మంత్రి క్షమాపణపై అనుమానాలు
ప్రభుత్వ భూములను ప్రోహిబిటెడ్ జాబితా నుంచి మార్చిన వ్యవహారం బయటపడిన తర్వాత, అది కేవలం ఒక తప్పిదమేనంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పడం అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోంది. యాదగిరిగుట్టలోని 42 ఎకరాల భూమి వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉందని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నప్పటికీ, ఈ అంశంపై ముఖ్యమంత్రి నుంచి ఇప్పటివరకు ఎందుకు స్పష్టమైన స్పందన రాలేదని బీజేపీ ప్రశ్నించింది.
పారదర్శక విచారణకు డిమాండ్
ప్రభుత్వ భూముల విషయంలో జరుగుతున్న ప్రతి అనుమానాస్పద వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరగాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు.










