నిర్మల్, 2026-06-05
వయవసయ్యద్ హైదర్ సన్మానంాయ టం నుపథయం నంచి వచచి, ననో షటనషటాన దరొంటూ విదయారథి దశ నంచు విదయా రంగ సయ్యద్మసయ్యద్యపై పోరాడతూను విదయన విజయవంతంగా పూరతి చుసయ్యద్ిన శతర అరవిందన ఆమ ఆదమ పారట నిరమ జిా శాఖ ఆధవరయంో ఘనంగా సయ్యద్నమానించార.
వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ విద్యార్థి దశ నుంచే విద్యా రంగ సమస్యలపై పోరాడుతూనే ఎల్ఎల్బీ విద్యను విజయవంతంగా పూర్తి చేసిన శీతల్కర్ అరవింద్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
అరవింద్ పట్టుదలకు నిదర్శనం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ మాట్లాడుతూ, సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అనేక ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కింది స్థాయి నుంచి నేడు ఎల్ఎల్బీ పట్టా పొందే స్థాయికి ఎదగడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. విద్యార్థి దశ నుంచే విద్యా రంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూనే న్యాయ విద్యను కొనసాగించి విజయవంతంగా పూర్తి చేయడం అరవింద్ పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు.
పార్టీకి గర్వకారణం
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, విద్యార్థి విభాగంలో జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టి ప్రజా సమస్యలపై పోరాడుతున్న అరవింద్ ఎల్ఎల్బీ పట్టా పొందడం పార్టీకి గర్వకారణమని సయ్యద్ హైదర్ అన్నారు. బడుగు, బలహీన, పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడాలని ఆయన ఆకాంక్షించారు. న్యాయ విద్యను ప్రజల కోసం ఉపయోగిస్తూ, అణగారిన వర్గాలకు అండగా నిలిచే మంచి న్యాయవాదిగా అరవింద్ ఎదగాలని ఆయన కోరారు.
న్యాయ విద్యను ప్రజల కోసమే
ఈ సందర్భంగా శీతల్కర్ అరవింద్ మాట్లాడుతూ, ఒకవైపు విద్యారంగ సమస్యలపై పోరాడుతూ మరోవైపు చదువును కొనసాగించాలనే సంకల్పంతో ముందుకు సాగానన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి ఎల్ఎల్బీ పట్టా సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకి లభించిన న్యాయ విద్యను కేవలం వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా బడుగు, బలహీన, పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఉపయోగించడమే తన ప్రధాన లక్ష్యమని అరవింద్ తెలిపారు. సమాజంలో అన్యాయానికి గురయ్యే ప్రతి ఒక్కరి తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడుతానని అన్నారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ నియోజకవర్గం అధ్యక్షులు రాజన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి నాయకులు, మిత్రులు తదితరులు పాల్గొని శీతల్కర్ అరవింద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.












