పానగల్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 08
రేపు ఉదయం 11 గంటలకు పానగల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తారు.

71 మందికి లబ్ధి
పానగల్ రైతు వేదికలో మొత్తం 71 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు, ప్రజలు, గ్రామ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
విజయవంతం చేయాలని పిలుపు
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు కోరారు.