నిర్మల్, 2026-06-05
నిర్మల్ నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న పలు గ్రామాల్లోని పుష్కర ఘాట్లకు మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట్ల నూతన ఘాట్లను నిర్మించాలని కోరుతూ, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి వినతి చేశారు.
నిర్మల్ నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సాంగ్వి, గుండంపల్లి, బన్సపల్లి, రత్నాపూర్ కాండ్లీ (సముందర్ పల్లి), సోన్, కుచన్‌పల్లి, పీచర, ధర్మారం, పర్పెల్లి, మునిపల్లి, చింతల్ చందా, పొన్కల్, కామల్‌కోట్, ముజ్గి తదితర గ్రామాల్లోని పుష్కర ఘాట్లకు మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట్ల నూతన ఘాట్లను నిర్మించాలని కోరుతూ, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి వినతి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాల్లోని పుష్కర ఘాట్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం, సురక్షితమైన స్నానాలకు వీలుగా నూతన ఘాట్లను నిర్మించాలని సూచించారు. ఈ విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.












