నిర్మల్, 2024-09-01
బీజేపీ సభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య జరిగిన పరస్పర దాడుల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
బీజేపీ సభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో నల్గొండకు బయలుదేరిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మలక్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.











