నిర్మల్, 2023-09-01
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్‌కు సంబంధించిన నోటీసులు అందుకున్న ఓటర్లకు అవగాహన కల్పించేందుకు నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు బీరవెల్లి, ప్యారామూర్ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు పలు సూచనలు చేశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్‌కు సంబంధించిన నోటీసులు అందుకున్న ఓటర్లకు అవగాహన కల్పించేందుకు నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు బీరవెల్లి, ప్యారామూర్ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందిన నోటీసుల వివరాలను ఆయన పరిశీలించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంబంధిత పత్రాలను సమర్పించి తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.
గ్రామాల్లో ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అనామలీస్, నో మ్యాపింగ్ అంశాలకు సంబంధించిన వివరాలను నాయకులు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, సర్పంచులు వరలక్ష్మి, లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు సిరాజొద్దీన్, శ్రీధర్, సాయన్న, నిర్మల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్, నాయకులు భూమారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్, గంగాధర్, మషీర్, మధుకర్, లింగారెడ్డి, రవీందర్‌రెడ్డి, మహిపాల్, విలాస్‌రావు, సోహెల్, మల్లేష్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.












