దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం ఆధ్వర్యంలో బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గురుస్వామికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధాని మోదీ పేరును కూడా గౌరవించలేని వ్యక్తులు దిష్టిబొమ్మ దహనం చేయడం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు నిజమైన నిబద్ధత ఉంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు, రాష్ట్రంలో విధిస్తున్న పన్నులపై అధ్యయనం చేసి మాట్లాడాలని హితవు పలికారు.
ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తుండగా, స్థానికంగా కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్, మాజీ రైల్వే బోర్డు సభ్యుడు జీవీ రమణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల వినతి మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ గురుస్వామి హామీ ఇచ్చినట్లు సమాచారం.










