భవన్) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.
నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీని బలోపేతం చేసేందుకు విశేష కృషి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కోరారు.
సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రాజీవ్ భవన్) లో జరిగిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలపర్చాలని నూతన అధ్యక్షులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ వన్ టౌన్ అధ్యక్షులు కోడిరెక్క ఇంద్ర కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ టూటౌన్ అధ్యక్షులు మహ్మద్ మోయిజ్, మిర్యాలగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండు నరేందర్ గౌడ్, వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రెగంటి రవీందర్ రెడ్డి, దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొర్ర నాగునాయక్ లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి, నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












