కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుంటాల సర్పంచ్ జక్కుల గజేందర్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచిందని, బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగి పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీజేపీలో కార్యకర్తలుగా ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకలలో కుబీర్ రాజన్న, సూర్యాపూర్ సర్పంచ్ ఎర్రోజు ప్రశాంత్, సౌదరి లక్ష్మణ్ పటేల్, కల్యాణి గజేందర్, తాటి శివ, సుద్దపు ముత్యం, మాధవ్ రావు, న్యకాపు నరేందర్, బోగ రవీందర్, సట్ల వినోద్, ఎడ్ల గజేందర్, ముద్దం వినోద్ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న కార్యకర్తలు నినాదాలు చేస్తూ గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ వేడుకల ద్వారా పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపడమే కాకుండా, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.












