పుట్టపర్తి, 4 September
బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని మున్నూరు కాపు రాజ్యాధికార తీవ్రంగా ఖండించింది. నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు జిల్లా అధ్యక్షురాలు వారధి స్వర్ణలత మాట్లాడారు.
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని ఖండిస్తున్నాం మున్నూరు కాపు రాజ్యాధికార జిల్లా అధ్యక్షురాలు వారధి స్వర్ణలత నాగర్కర్నూల్, సెప్టెంబర్ 4: బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని మున్నూరు కాపు రాజ్యాధికార నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు వారధి స్వర్ణలత తీవ్రంగా ఖండించారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని కార్యాలయంలో శుక్రవారం ఆమె అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారధి స్వర్ణలత మాట్లాడుతూ.. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆమె కుమార్తె మీడియా సమావేశంలో మాట్లాడిన తీరును సాకుగా చూపుతూ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మంత్రి పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు. కాంగ్రెస్ లో రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రితో పాటు పై విమర్శలు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. అయితే బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ విషయంలో మాత్రం చర్యలు తీసుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఓట్లు మనవే.. సీట్లు మనవే’ ప్రభుత్వాలు ఏవి వచ్చినా ‘ఓట్లు బహుజనులవి.. సీట్లు అగ్రకులాల వారివి’ అనే పరిస్థితి కొనసాగుతోందని స్వర్ణలత అన్నారు. బీసీ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘ఓట్లు మనవే.. సీట్లు మనవే’ అనే నినాదంతో పనిచేసి, వచ్చే ఎన్నికల్లో బీసీల రాజకీయ సత్తాను చాటాలని కోరారు. సమావేశంలో రాజ్యాధికార ఉపాధ్యక్షుడు తీగెల భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఏటిగడ్డ శ్రీనివాసులు, పాలమూరి మురళి, పొడుగు రాఘవులు, వారధి నరేందర్, జాజుల బాలరాజ్, జంగిటి నరేందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.












