లోకేశ్వరం, 4 September
లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం కిస్టాపూర్ గ్రామంలో గోదాము నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో గోదాముల నిర్మాణంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
*కిస్టాపూర్లో గోదాముకు భూమిపూజ.. నర్సింహనగర్ తండాలో ఇందిరమ్మ ఇళ్లకు , గోదాము నిర్మాణానికి శ్రీకారం...* మండలంలో అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు భూమిపూజ...* లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు శ్రీకారం చుట్టారు. శుక్రవారం కిస్టాపూర్ గ్రామంలో గోదాము నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.గ్రామీణ ప్రాంతాల్లో గోదాముల నిర్మాణంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు పండించిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు గోదాములు ఉపయోగపడతాయని, పంటను వెంటనే తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి తగ్గుతుందని పేర్కొన్నారు. అవసరమైన సమయంలో పంటను విక్రయించుకునే అవకాశం కలగడంతో రైతులకు మెరుగైన ధర లభించేలా గోదాములు దోహదపడతాయని అన్నారు.అనంతరం నర్సింహనగర్ తండాలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అలాగే కొత్తగా నిర్మించనున్న మరో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేశారు. తండాలో గోదాము నిర్మాణానికి కూడా భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.












