కామారెడ్డి, 4 September
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు.
రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ ఉపసంహరించుకోవాలి కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డిమాండ్ , సెప్టెంబర్ 4: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కుల వివక్షకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితుల గౌరవం, రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, భాస్కర్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












