అనకాపల్లి, 31 July
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని గండిపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభాపతి అయ్యన్నపాత్రుడు, తన కుమారుడికి రాజ్యసభలో స్థానం దక్కడంపై ప్రజలకు, దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని బి బి పాలెం పంచాయితీ శివారి గ్రామమైన గండిపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సభాపతి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల ఆదరభిమానాలు, దేవుడి దయ వల్ల తన కుమారుడికి రాజ్యసభలో స్థానం దక్కిందని తెలిపారు. రాజ్యసభలో విజయ్ చేసిన తొలి ప్రసంగాన్ని విన్నప్పుడు ఒక తండ్రిగా తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజాన సూర్య చంద్ర, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రపాత్రుడు, నందకిషోర్, అల్లు నాయుడు, మాజీ వైస్ ఎంపీ పి. రమణ, ఆర్.డి.ఓ. రమణ, తాసిల్దార్ నూకరాజు, ఎంపీడీవో చాయసుధ, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












