కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకుఒక న్యాయం.. అగ్రవర్ణాలకు ఒక న్యాయమా ..?
👉 బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
మిర్యాలగూడ ఆగస్టు 22 (మనోరంజని తెలుగు టైమ్స్)
తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో బీసీలను
అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని
బీసీయువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆరోపించారు. శనివారంమిర్యాలగూడలో బీసీ యువజన సంఘం సమావేశంలో అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎంతోమంది అగ్రవర్ణాల నాయకులు ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి పై ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ మంత్రి అయినటువంటి కొండా సురేఖ, కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.ఒక బీసీ మహిళ మంత్రి కూతురు చేసిన ఆరోపణలకు మంత్రికి నోటీసులు ఇవ్వడం యావత్ బీసీ సమాజం అంతా గమనిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అగ్రవర్ణాల పార్టీయేనా అగ్రవర్ణాలు ఓట్లు వేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందా అని అశోక్ ప్రశ్నించారు.అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు బీసీల అణిచివేత ధోరణి తప్ప బీసీల అభ్యున్నతికి కృషి చేసింది ఏమీ లేదన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటుచేసి కొండా సురేఖ ను మంత్రి పదవి నుంచి తొలగించాలని, సమావేశమైన ఎమ్మెల్యేలు గత ఎంతో కాలంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ,చిన్నరెడ్డి వంటివాళ్ళు ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ వారిపై నేటికి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో విశ్వాసం కోల్పోయిందన్న విషయం ఎమ్మెల్యేలు గమనించాలని, నియోజకవర్గాలలో ఓట్లు వేసేది బీసీలు అది గుర్తుంచుకొని ముందుకు సాగితే మంచిదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బిసి సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్ దాసరాజు జయరాజ్, బీసీ జెసి పట్టణం కో కన్వీనర్ మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.











