భద్రాద్రి కొత్తగూడెం, 2026-08-22
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండో దశ ప్రక్రియపై శనివారం ఒక సాధారణ సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ నాయుడు హాజరయ్యారు.

రానున్న పది రోజుల్లో ఓటరు ప్రతినిధులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్ల జాబితాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఈ సందర్భంగా సూచించారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, తప్పులు లేదా మార్పులు ఉంటే వాటిని గుర్తించి సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
పార్టీ శ్రేణులకు పిలుపు
ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాలను సమగ్రంగా పరిశీలించి, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సోడి చలపతి పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.