బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
సోనాల మండలంలోని దేవులనాయక్ తండాకు చెందిన బీఆర్ఎస్ ఉప సర్పంచ్ జాదవ్ అరవింద్, వార్డు సభ్యుడు మోహితే క్రిష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ సమక్షంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
సోనాల మండలంలోని దేవులనాయక్ తండాకు చెందిన బీఆర్ఎస్ ఉప సర్పంచ్ జాదవ్ అరవింద్, వార్డు సభ్యుడు మోహితే క్రిష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ సమక్షంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సోనాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వినోద్ సింగ్, చింతలబోరి సర్పంచ్ శ్రీరామ్, పీఏసీఎస్ డైరెక్టర్ లోలపు పోశెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











