వీణవంక, 3 September
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట లో భారీ నిరసన – రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. **“కాంగ్రెస్ బాకీ కార్డు”**ను ప్రజలకు పంపిణీ చేస్తూ అమలు కాని హామీలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దేవాలయాల్లో దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసి ప్రజలకు గ్యారెంటీ కార్డులు అందజేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పి నేడు వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. “100 రోజుల్లో అమలు” అంటూ ప్రజలను నమ్మించి ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ఆయన, యూరియా కొరత, రైతు సంక్షేమ పథకాల నిర్లక్ష్యం, సాగునీటి విషయంలో ప్రభుత్వ వైఫల్యం రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచాయని అన్నారు. రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వంటి హామీలు అమలు కాక రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి కీలక హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని పేర్కొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్ రావు, ముసిపట్ల తిరుపతి రెడ్డి, మాడ సదావ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కామిడి శ్రీనివాస్ రెడ్డి, సిద్ధిపల్లి మహిపాల్ రెడ్డి, నీల కుమారస్వామి, దాసరపు రాధాకృష్ణ, కాసర్ల సుధాకర్, జక్కు నారాయణ, ముత్యాల శంకర్, నాగిడి సంజీవ రెడ్డి, కాంతారెడ్డి మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, అడిగిప్పుల సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












