మంచాల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల సంబురాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి సందర్భంగా వేడుకలు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం మనోరంజని: రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తైన సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబురాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా తుర్కయంజాల్ చెరువు కట్ట, మున్సిపల్ కార్యాలయం ముందు, అంబేడ్కర్ విగ్రహం వద్ద మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధారాంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఆదిభట్లలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించగా, మండల కేంద్రంలో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు నిర్బంధాలు, ఆంక్షల మధ్య స్వేచ్ఛను కోల్పోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ, ప్రజాకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. మల్రెడ్డి సారథ్యంలో ఇబ్రహీంపట్నానికి అగ్రతాంబూలం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ప్రభుత్వం నిధుల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గత దశాబ్దానికి పైగా కాలంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారు తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలతో పోలిస్తే ఇబ్రహీంపట్నం ప్రాంతానికి పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ ‘ఏ’ బ్లాక్ అధ్యక్షులు పాండురంగారెడ్డి, ‘బి’ బ్లాక్ అధ్యక్షులు భాస్కరాచారి, మహిళా నాయకులు కొత్తకుర్మ మంగమ్మ, గుండమోని జయమ్మ, ఇబ్రహీంపట్నం, మండలాల పార్టీ అధ్యక్షులు లింగం, నరేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం టౌన్ పార్టీ అధ్యక్షులు గౌస్‌పాష, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఐలయ్య, రజినీకాంత్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు సికిందర్‌రెడ్డి, అయన్పటేల్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.












