భారత రాజకీయాల్లో అణగారిన వర్గాలకు ఆశాకిరణంగా నిలిచిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఆయన సేవలను కొనియాడారు.
మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం బైపాస్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ జీవితం, ఆశయాలు స్ఫూర్తిదాయకమని అన్నారు.
జగ్జీవన్ రామ్ భారత రాజకీయాల్లో ఒక ధ్రువతార అని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ డిలీగెట్ చిరుమర్రి కృష్ణయ్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలికాంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సామాజికవేత్త డాక్టర్ రాజు, ఉబ్బపల్లి కాశయ్య, మొండి కత్తి లింగయ్య, రెమిడాల పరశురాములు, దైద సురేష్ వంటి ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు అర్పించారు.












