షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు సత్కారం జరిగింది.
భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను శాలువాతో సత్కరించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అంజయ్య యాదవ్ ను 'నవతరం నాయకుడు, ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత'గా అభివర్ణించారు. భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో షాద్ నగర్ మరింత అభివృద్ధి చెందాలని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
అంజయ్య యాదవ్ మంచి మనస్సున్న నాయకుడని, అనేక మంది పేదల పక్షాన నిలబడి సేవ చేశారని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో భీమారం ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మన్ నాయక్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం, సత్యం, భీమారం వార్డు సభ్యులు వీరేశం, ప్రశాంత్ గౌడ్, యాదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










