రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి అధికారుల (వి.ఓ.ఏల) నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, కుంటాల మండల వి.ఓ.ఏలు బుధవారం ఒంటికాలిపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు.
గ్రామీణాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల బలోపేతంలో సేవలందిస్తున్న తమకు సరైన గుర్తింపు, హక్కులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వి.ఓ.ఏలు ఆరోపించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
"వి.ఓ.ఏల ఐక్యత వర్ధిల్లాలి", "మా డిమాండ్లు అమలు చేయాలి" అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు బక్కి మహేష్, కార్యదర్శి హసీనా, కోశాధికారి సంపత్, గజ్జరాం, లావణ్య, రావుఫ్, ప్రశాంత్, ఖమురోద్దిన్ మరియు పలువురు వి.ఓ.ఏలు పాల్గొన్నారు. తమ డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.











