బోయినపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 18
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ గర్వించదగిన పోరాటయోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం కులబాంధవుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉప సర్పంచ్ పొత్తూరి శైలజ, వార్డు సభ్యులు దమ్మ వెంకటరమణ, జోగు శంకర్, దయ్యాల రేణుక, ఏఎంసీ డైరెక్టర్ కల్లేపల్లి సతీష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ.. మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ, అణచివేయబడిన బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి అన్యాయాన్ని ఎదిరించిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
విజయవంతం చేసినవారు
కార్యక్రమంలో మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, గ్రామ కార్యదర్శి శేఖర్, గౌడ సంఘం కులబాంధవులు, యువకులు, మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












