సారంగాపూర్, 2026-08-18
సారంగాపూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌడ సంఘం నాయకులు, సభ్యులు నివాళులర్పించారు.

పాపన్న గౌడ్ సేవలు
ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని అన్నారు. ఆయన జీవిత చరిత్ర నేటి సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఎల్ల గౌడ్, నితీష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, చంద్రమోహన్ గౌడ్, నిఖిల్ గౌడ్, నవీన్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, బాలు గౌడ్, విఘ్నేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.