ముప్కాల్ మండలం వెంచర్యాల గ్రామంలో ఓరుగంటి శివ (41) అనే వ్యక్తి బుధవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తూ, మూడు సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా నుండి జీవనోపాధి కోసం వెంచర్యాల గ్రామానికి వలస వచ్చాడు. వీరు గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య ఆర్థిక సమస్యలు, మద్యానికి బానిసత్వం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం శివ ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.












