నిర్మల్, 2026-06-05
ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పనుల కేటాయింపు, కొలతలు, మాస్టర్ల నమోదులో అక్రమాలకు పాల్పడుతూ కూలీల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో క్షేత్రస్థాయిలో వీరి ఇష్టారాజ్యం పెరిగిపోయిందని ఆయన అన్నారు.

రైతుల నుంచి వసూళ్లు
ఉపాధి హామీలో మొక్కలు, గుంతల తవ్వకాల పేరుతో టెక్నికల్ అసిస్టెంట్లు రైతుల నుండి డబ్బులు వసూలు చేసి బిల్లులు చేయకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి పనులకు ఎలాంటి నగదు వసూలు చేయకూడదని, అయినప్పటికీ రైతుల దగ్గర నుండి వేల రూపాయలు వసూలు చేసి సంవత్సరం గడిచిన బిల్లులు చేయకపోవడంతో ఎవరికి చెప్పాలో అర్థం కాక రైతులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు.
అధికారుల ఒత్తిడి
సరైన కొలతలు నమోదు చేయకుండా, ఆన్లైన్ అప్డేట్ చేయకుండా బిల్లులు నిలిపివేయడం, గంటల పరిశీలన, రికార్డుల తయారీకి ముడుపులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, డబ్బులు ఇస్తేనే ఫోటోలు అప్లోడ్ చేస్తామని లేదంటే బిల్లు రాదని చెప్పడంతో చేసేదేమీ లేక పలువురు రైతులు డబ్బులు ఇచ్చామని చెబుతున్నారు. లంచాలు ఇచ్చి సంవత్సరం గడిచిన బిల్లు రాకపోవడంతో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం శూన్యమని వాపోతున్నారని గోవింద నాయక్ అన్నారు.
క్యాటిల్ షెడ్ల నిర్మాణం
జిల్లాలో పలు గ్రామాలలో క్యాటిల్ షెడ్ల నిర్మాణం కోసం వేల రూపాయలు వసూలు చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారని ఆయన తెలిపారు.