లోకేశ్వరం, 2026-06-05
మండల కేంద్రంలోని అమెరి కిడ్స్ అండ్ కాలర్స్ పాఠశాలలో ఆషాఢ బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి అలరించారు. ముఖ్యంగా బాలికలు అమ్మవారి వేషధారణలో, బాలురు పోతురాజుల వేషాలలో చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం
మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టిన ఈ వేడుకలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.