హైదరాబాద్, జులై 18
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.












