మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్ సహా ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.












