తారోడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 25
ముధోల్ మండలం తారోడ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మంగళవారం చెరువు కట్టపై సర్పంచ్ ఆరిఫ్ ఓద్దీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ తమ విధిగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
ముధోల్ మండలం తారోడ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మంగళవారం చెరువు కట్టపై సర్పంచ్ ఆరిఫ్ ఓద్దీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ తమ విధిగా మొక్కలు నాటాలని ఆయన అన్నారు.
పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత
మొక్కలు ప్రాణవాయువును అందిస్తాయని, ఇంటి ముందు, పెరట్లో, వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాయు కాలుష్యం, వాతావరణ మార్పులను మొక్కలు అరికడతాయని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లవకుమార్, ఏపీఓ శిరీష, ఉపసర్పంచ్ రజిత హన్మంత్ రావ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












