బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 24
ఆగస్టు 15న ఉత్తమ అవార్డు అందుకున్న బైంసా ఎంపీడీఓ నీరజ్ కుమార్ ను సోమవారం సర్పంచులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం బైంసా ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది.
ఆగస్టు 15న ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ప్రశంసా పత్రాన్ని అందుకున్న బైంసా ఎంపీడీఓ నీరజ్ కుమార్ను సోమవారం బైంసా ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
సర్పంచుల అభినందన
ఈ సందర్భంగా సర్పంచ్లు నీరజ్ కుమార్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా అవార్డు అందుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు విజయ్, గణేష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

