అక్షర కుసుమాలు, హిందీ సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో “సు’వర్ణ వ్యవస్థ” పుస్తకావిష్కరణ సభ ప్రగతి నగర్లోని సుందరయ్య భవన్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కవి బొందిడి పురుషోత్తమరావును ఘనంగా సత్కరించారు.
శ్రీ సాధనాల వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన బొందిడి పురుషోత్తమరావు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు, నిర్వాహకుల ఆహ్వానం మేరకు హాజరై సత్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా పురుషోత్తమరావు “అభ్యర్థన” శీర్షికన తన కవితను వినిపించి సభికుల మన్ననలు పొందారు.
పురుషోత్తమరావు ఇంతవరకు ‘శ్రీ సరస్వతీ శతకం’, ‘కళ్యాణ కుంతలం’, ‘సహ్యాద్రి పరిమళం’, ‘కరోనా వైరసీయం’, ‘మనసు పొలిమేరల్లో’, ‘వైఢూర్యపుర వైభవం’, ‘విజయ వైఢూర్యం’ వంటి పలు పుస్తకాలను రచించారు.
గతంలో ఆయనకు ‘గిడుగు పురస్కారం’, ‘పద్య వైభవం ఆవిష్కార పురస్కారం’ వంటి గౌరవాలు లభించాయి. ఆకాశవాణి ద్వారా అనేక రేడియో నాటికలు, ప్రసంగాలను సమర్పించి సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేశారు.










