నటుడు జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం, పండ్లను పంపిణీ చేశారు. పట్టణ అధ్యక్షులు ఇండ్ల గణేష్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, పట్టణ అధ్యక్షులు ఇండ్ల గణేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అల్పాహారంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇండ్ల గణేష్ మాట్లాడుతూ, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం, పేదల ఆకలి తీర్చడంలో ఉండే సంతోషం అమూల్యమైనదని అన్నారు.
ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని, సమాజంలో తోటివారికి సహాయం చేయాలనే ఆలోచన అందరిలో పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డైమండ్ నేత్ర నిధి వ్యవస్థాపకులు లయన్ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్), లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి.యం నాయుడు, జెడ్.సి. యనగండ్ల లింగయ్య, భాస్కర క్లబ్ సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, కర్ర రాంరెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
అంతేకాకుండా, అభిమానులు బంటు రాజు, సమ్మెట ఉంపేందర్, ధర్మతేజ, శివ శంకర్, మహేందర్, నారి, రాము, శివ, శ్రీకాంత్, నీరుడు రాంబాబు, మనోహర్, సోమయ్య తదితరులు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.











