హైదరాబాద్, 2026-08-03
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ చట్ట సవరణ బిల్లు 2026కు లోక్ సభ సోమవారం ఆమోదం తెలిపింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచేందుకు ఈ బిల్లును రూపొందించారు.

కక్షిదారులకు ఇబ్బందులు తొలగింపు
జడ్జిల సంఖ్య పెంపుతో కక్షిదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2019లో ఒకసారి, ఇప్పుడు మరోసారి జడ్జిల సంఖ్య పెంచారని తెలిపారు.
వేగవంతమైన న్యాయం లక్ష్యం
దేశ ప్రజలకు వేగంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లులను కేంద్రం తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కేంద్రం రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిందని ప్రశంసించారు.